ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు షాక్..

by Shyam |
ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు షాక్..
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. సీనియర్ నేత జంగయ్య టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్నారు. ఆయనతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు.. మాజీ సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తూనే పార్టీలో చేరేందుకు కార్యకర్తలు ముందుకు వస్తున్నారని జానారెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగాదాల కారణంగా అభివృద్ధి చేసే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరుకుంటున్నాని అన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే కానీ, టీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

Advertisement

Next Story