- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. మంత్రిమండలిని విస్తరించారు. ముగ్గురు బీజేపీ నేతలు, ఇద్దరు రెబల్ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర క్యాబినెట్‌లో చోటుకల్పించారు. బీజేపీ లీడర్లు నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్‌లను, కాంగ్రెస్ రెబల్స్ తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్‌లు రాష్ట్ర క్యాబినెట్ క్యాబినెట్ మంత్రులుగా రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. మరింత మంది మంత్రులను మే 3వ తేదీన లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నియమిస్తారని ఓ నేత తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటనకు ఒక రోజు ముందు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో ‘వన్ మ్యాన్ గవర్నమెంట్’ సాగుతున్నది. కాంగ్రెస్ రెబల్స్‌లోనే ఆరుగురు మంత్రులున్నారని, కాగా, ఇతర నేతలూ మినిస్టర్ పదవి కోసం ఆశించడంతో క్యాబినెట్ విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేసేందుకే పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని ఓ బీజేపీ నేత తెలిపారు. కానీ, రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగమందుకోవడం, మంత్రుల నియామకాలపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ జరిగిందని వివరించారు.
కొత్తగా నియమించిన మంత్రుల్లో నరోత్తం మిశ్రా.. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేశారు. ఒకానొక దశలో శివరాజ్ సింగ్‌తో పాటుగా సీఎం సీటు రేసులో ఉన్నారు. కాగా, మిగతా ఇద్దరు మంత్రులను కమ్యూనిటీల ఆధారంగా నియమించారు. కమల్ పటేల్ ఓబీసీల ఫేస్, మీనా సింగ్ ట్రైబల్ కమ్యూనిటీకి సింబల్‌గా క్యాబినెట్‌లోకి తీసుకున్నట్టు తెలిసింది. అన్ని వర్గాలకు చెందినవారికీ క్యాబినెట్‌లో అవకాశమివ్వాలని ప్రయత్నించినట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా, ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు బలమైన మద్దతుదారులని తెలిసిందే.
Tags: madhya pradesh, shivraj singh chauhan, cabinet, extension, inducted, coronavirus, pandemic