నటుడు శివాజీ రాజాకు గుండె పోటు

by Shyam |   ( Updated:2020-05-05 12:19:19.0  )
నటుడు శివాజీ రాజాకు గుండె పోటు
X

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్టార్ హాస్పిటల్ లో ప్రత్యేక వైద్య బృందం అతనికి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచారని… గురువారం హార్ట్ కు స్టంట్లు వేయనున్నట్లు తెలిపారు కుటుంబీకులు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

కాగా శివాజీ రాజా వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శివాజీ రాజా… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన… కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు తన వంతు సహాయం అందిస్తున్నారు. కాగా కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివాజీ రాజాకు బిపి డౌన్ కావడం వల్లే గుండె నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags: Shivaji Raja, Tollywood, Heart Attack

Advertisement

Next Story