ఎపీలో నెక్స్ట్ పథకం ఇదే!

by srinivas |
ఎపీలో నెక్స్ట్ పథకం ఇదే!
X

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత వివిధ వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గొర్రెల కాపరులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పేరు వైఎస్సార్సీ కాపరి బంధు. ఈ పథకంలో భాగంగా గొర్రెల కాపరులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కానుకగా ఇవ్వనున్నారు. వీటి కొనుగోలుకు అవసరమయ్యే 1.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత వెల్లడించనుంది.

Tags: ysr goat bandhu, Shepherds, kapari bandhu, ap government, ysrcp

Advertisement

Next Story