ఆమెది ఈ జిల్లా కాదు.. మేము వైద్యం చెయ్యం..!

by srinivas |   ( Updated:2021-06-06 04:45:39.0  )
ఆమెది ఈ జిల్లా కాదు.. మేము వైద్యం చెయ్యం..!
X

దిశ, ఏపీ బ్యూరో : ఆ యువతికి బ్లాక్​ఫంగస్​సోకింది. ఓ ప్రైవేటు వైద్య ప్రబుద్దుడు వారం పాటు చికిత్స చేసి రెండున్నర లక్షలు వసూలు చేసి చేతులెత్తేశాడు. తీరా ప్రభుత్వాస్పత్రికి పోతే మీ చిరునామా ఈ జిల్లాది కాదు గనుక చేర్చుకునేది లేదని చెప్పడం దారుణం. ఈఘటన ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది.

రోగి పేరు కే పద్మ, 36 ఏళ్లుంటాయి. ఆమె సొంతూరు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఓ కుగ్రామం. ఆమె వివాహిత. కృష్ణా జిల్లాలోని తన భర్త చిరునామా ఆధార్​లో నమోదైంది. బ్లాక్​ఫంగస్ అని నిర్ధారణ కావడంతో ఒంగోలులో ట్రీట్​మెంటు తీసుకుంది. చికిత్స అందించిన ప్రైవేటు వైద్యుడు చేతులెత్తేయడంతో రిమ్స్​కు వెళ్లింది. ఆమె చిరునామా ప్రకాశం జిల్లాలో లేని కారణంగా రిమ్స్​వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. పైగా గుంటూరు జనరల్ ఆస్పత్రి వెళ్లాలంటూ సిఫారసు చేశారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పీఎస్​దృష్టికి తీసుకెళ్తే అయన కూడా వైద్యులు చెప్పిన మాటే చెప్పడం విడ్డూరం. ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని నడుపుకునే తమకు వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్తోమత లేదని వాపోతున్నారు. తక్షణమే ఆమెకు చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story