- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తండ్రి ఉంటే ఆ పని చేసేవారు: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధించిందా? వరంగల్ జిల్లాను స్మార్ట్‌సిటీగా చేస్తామన్నారు.. అయిందా అని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, వైఎస్సార్ అభిమానులతో బుధవారం ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత షర్మిల వైఎస్సార్ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చేట్లు ఉందా? అని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారు. కనీసం కాకతీయ వర్సిటీకి వీసీని కూడా నియమించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఎందరో విద్యార్థుల బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ విద్యార్థులపై దాడులు చేయించడం బాధాకరమని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిన విద్యార్థులకు, జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ నగరంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని షర్మిల తెలిపారు. వైఎస్సార్ బతికుంటే వరంగల్ జిల్లాను మరో ఐటీ సిటీగా మార్చాలని కలలు కన్నారని గుర్తుచేశారు. రాజన్న బిడ్డగా మీ సలహాలు, సూచనలు తనకు అందించాలని వరంగల్ నాయకులను ఆమె కోరారు. కాగా, ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు, నాయకులు భారీగా తరలివచ్చారు. కాబోయే సీఎం షర్మిల అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ నియజకవర్గానికి చెందిన నాయకుడు భూమిరెడ్డి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చి నృత్యాలు చేశారు.
రోజుకు రెండు జిల్లాల్లో పర్యటిస్తాం : కొండా రాఘవరెడ్డి
ఇప్పటి వరకు ఐదు జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినట్లు షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఎండలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఒక్కరోజే రెండు జిల్లాల్లో పర్యటన కొనసాగించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల చివరికల్లా అన్ని జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తిచేస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఖమ్మం లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు