- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sex & Science : ఫోన్ సెక్స్ అలవాటు నుంచి ఎలా బయటపడాలి..?
డాక్టర్ గారూ.. నా వయసు 35. మా వారి వయసు 43. ఇద్దరు పిల్లలు. తను బిజినెస్‌లో ఉన్నారు. ఆయనకో అసహ్యమైన అలవాటున్నది. తన పరిచయస్తులైన స్త్రీలతో ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడడమే కాదు.. మాట్లాడుతూ హస్త ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఈ అలవాటు కాలేజ్ రోజుల నుంచి అలవాటయిందట. ఎంత చెప్పినా ఈ అలవాటు మానటం లేదు. వాళ్లతో లైంగిక సంబంధంలో కూడా ఉన్నాడు. నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. విడిపోవాలని చాలా ప్రయత్నించాను. కానీ పిల్లల వల్ల ఈ నీచుణ్ణి భరిస్తున్నాను. అతనికి దూరంగా ఉంటున్నాను. అసలీ ఫోన్ సెక్స్ ఎందుకు అలవాటవుతుంది. ఇదేమైనా మానసిక వ్యాధా దీనికి చికిత్స ఉందా చెప్పండి మేడమ్. ఇతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. - లావణ్య, నిజామాబాద్.
ఖచ్చితంగా చికిత్స ఉంది. అయితే ఇదొక తీవ్రమైన మనోలైంగిక సమస్య. ముందు దీన్ని వైద్య పరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆన్‌లైన్, బిల్ బోర్డులపైన, టీవీల్లో, ఫోన్స్‌లో, పత్రికల్లో, మీడియాలోని చాలా శాఖలలో ప్రతి చోట ప్రపంచమంతా సెక్స్, దానికి సంబంధించిన సమాచారం ఉంది. అంతే కాదు మనుషులలో కూడా సెక్స్ పట్ల తీవ్రమైన ఇష్టం, తనను తాను నిగ్రహించుకోలేని బలహీనత, వ్యసనం రోజు రోజుకి తీవ్రమౌతున్నది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వారి పరిశోధనల ప్రకారం మనుషులలో మితిమీరిన శృంగార వాంఛ ఒక వదిలించుకోలేని బలహీనత, వ్యసనంగా మారుతున్నది. సెక్స్, దానికి సంబంధించిన ఆలోచన, దాని చుట్టూ అల్లుకున్న చర్యలు, వీటిలో పాలు పంచుకోవాలన్న తీవ్రమైన ఆసక్తి, అలవాటు చివరికి భార్యాభర్తల మధ్య బంధాన్ని బలహీన పరుస్తున్నది. పని చేసే స్థలాల్లో సమస్యలను సృష్టించడమే కాదు సమాజంలో సరిగా కలవలేకపోతారు. దురలవాట్ల తీరుతెన్నులు తీవ్రమైన సెక్స్ వాంఛతో శృంగారంలో ఎక్కువగా, అతిగా పదేపదే పాల్గొనడం, పాల్గొనకుండా ఉండలేని మానసిక స్థితిలో అనియంత్రితంగా అయిపోవడం. ఈ స్థితిలో ఉన్న వీరు సెక్స్‌కు సంబంధించిన పనిలోనే నిరంతరం ఉంటుంటారు.
- నీలి చిత్రాలు టీవీలో గాని, ఇంటర్నెట్‌లో గాని పదేపదే చూడటం
- దైనందిన జీవితం దెబ్బతినేంతగా రోజులో ఎక్కువ కాలం సెక్స్‌కి సంబంధించిన ఆలోచనలతో గడిపేయడం
- సెక్స్ పత్రికలను ఎక్కువగా సేకరించడం
- సెక్స్ వాంఛను పరిపూర్తి చేస్కోవడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం. ఉదాహారణకు ఏకకాలంలో అనేక మందితో సెక్స్ సంబంధాలు నెరపడం
- బహిరంగ స్థలాల్లో ఏ మానసిక అవరోధాలు లేకుండా సెక్స్‌లో పాల్గొనడం
- అతిగా హస్త ప్రయోగం. రోజులో 5-10 సార్లు హస్త ప్రయోగం చేసుకుంటూ ఉండటం
ఈ సెక్స్ అడిక్షన్స్ (వ్యసనాలు) ఉన్న రోగులు తమ ప్రవర్తనకు ఏదో ఒక లాజిక్‌తో కూడిన కారణాలు వెతుక్కుంటారు. వీళ్ళు చాలా సార్లు తమ ఈ అతి అసహజ లైంగిక ప్రవర్తనకు, సమస్యలకు ఎదుటివాళ్లను నిందిస్తుంటారు. ఎదుటివాళ్ల వల్లనే తాము ఇలా చేయాల్సి వస్తున్నదని చెపుతుంటారు. కొంతమంది ఈ ప్రవర్తనకు తాము బానిసలం అయ్యామన్న విషయాన్ని ఒప్పుకోకుండా దాన్నొక సెక్స్ సమస్యగా మాత్రమే చెపుతుంటారు. ఈ సెక్స్ అడిక్షన్ మెల్లగా ఇష్టంగా మారిపోతుంది. ప్రారంభంలో గంటల కొద్ది పోర్నోగ్రఫి చూస్తూ గడుపుతుంటారు. ఆ తర్వాత వీరు డబ్బులు కట్టి ఆన్ లైన్ సెక్స్ గ్రూపులతో చేరిపోతారు. ఇవి తీవ్రమై బయట అనేక మందితో సెక్స్‌లో పాల్గొంటూ ఆఖరుకు ప్రమాదకరమైన లైంగిక వ్యాధులకు గురి అవుతూ ఉంటారు. ఇంట్లో తమ భార్యలకు ఈ వ్యాధులను అంటిస్తారు.
- ఒకే రాత్రిలో అనేక సార్లు సెక్స్‌లో పాల్గొని భాగస్వామిని బాధ పెడుతుంటారు.
- కండోమ్ లేకుండా సురక్షితం కాని పద్ధతుల్లో సెక్స్‌లో పాల్గొంటారు.
- ఇతరులు సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు దొంగతనంగా చూస్తారు.
- వావి వరుసలు లేకుండా లైంగిక అత్యాచారాలకు తెగబడతారు.
- కోరిక తీర్చకపోతే ఏదో ఒక విధంగా, ఏదో ఒక పద్దతిలో లైంగిక హింసలకు, వేధింపులకు పాల్పడతారు.
వీళ్లలో బాంధవ్యాలు, ప్రేమలు ఉండవు. కోరిక తీర్చుకోవడమే లక్ష్యంగా సంబంధాలను మారుస్తుంటారు. అందుకే వీళ్లలో ఎక్కువగా ఆన్ లైన్‌లో పోర్నోగ్రఫి లేదా ఫోన్‌లో సెక్స్ చాటింగ్ ద్వారా తృప్తి పడుతుంటారు. సెక్స్ అడిక్ట్స్‌కి వాళ్ళ ప్రవర్తన మీద అదుపు ఉండదు.
ఫోన్ సెక్స్ అడిక్షన్‌కు చికిత్స
కాగ్నిటివ్ థెరపీ, బి ఏం టి, ఎవర్షన్ థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా ఈ రకమైన మనోలైంగిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్య ఉన్న వారు సెక్సాలజిస్ట్‌ను వెంటనే సంప్రదించాలి. బాధితులు సాక్ష్యాధారాలతో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేస్తే, విచారణ చేసి, దోషిగా నిర్ధారించినట్లైతే కఠినమైన జైలు శిక్ష పడుతుంది.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్