నిధుల సేకరణ ప్రయత్నాల్లో సీరం ఇన్‌స్టిట్యూట్

by Harish |
నిధుల సేకరణ ప్రయత్నాల్లో సీరం ఇన్‌స్టిట్యూట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) బ్లాక్‌స్టోన్, కేకేఆర్‌ (Blackstone, KKR)తో సహా పెద్ద ఈక్విటీ పెట్టుబడిదారుల (Equity investors) నుంచి 1 బిలియన్(సుమారు రూ. 7,500 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యూకేకు చెందిన జెనర్, ఆక్స్‌ఫర్డ్ (Jenner, Oxford)యూనివర్శిటీలు అభివృద్ధి చేసిన టికా ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభించాలనే సంస్థ ప్రణాళికకు అనుగుణంగా ఈ నిధుల సేకరణ చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. నిధుల సేకరణకు గోల్డ్‌మన్ శాచ్స్, అవెండస్‌ (Goldman Sachs, Avendus)లు సాయంగా ఉండనున్నాయి. పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి (Representative of the Serum Institute) ఒకరు తెలిపారు.

అయితే, నిధుల సేకరణ అంశంపై బ్లాక్‌స్టోన్, కేకేఆర్ (Blackstone, KKR) ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ (kovid vaccine-19) ఉత్పత్తి కోసం నిధుల సమీకరణకు బహుళ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ ధృవీకరించింది. ప్రతి నెలా కోటి మోతాదుల వ్యాక్సిన్ (vaccine) తయారు చేయాలని భావిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ (Serum Institute), ఇదివరకే టీకా అభివృద్ధి కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (Bill and Melinda Gates Foundation) నుంచి సుమారు రూ. లక్ష కోట్లను అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed