- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోగనున్న బడిగంట.. ఫిజికల్ క్లాసులకు ముహూర్తం ఫిక్స్..?
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ గా తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ ఆలోచిస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది విద్యాశాఖ. అనుమతులు వెలవడిన వెంటనే తరగుతులు ప్రారంభం కానున్నాయి. టీచర్లందరికీ ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు ప్రారంభించాలని సన్నాహకాలు చేస్తున్నారు. పాఠశాలల్లో స్కావెంజర్ల కొరత ఉండటంతో శానిటేషన్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2020 మార్చి 15 నుంచి పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే.
వైద్యారోగ్యశాఖ సూచనలతో పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ తరగతులు ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిజికల్ గా తరగుతులు నిర్వహించకపోవడం వలన విద్యార్థుల్లో పూర్తిగా విద్యా ప్రమాణాలు కొరవడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
2020 మార్చి 15న మూతపడిన పాఠశాలలు..
కరోనా ఫస్ట్ వేవ్ మొదలైనప్పుడు విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 2020 మార్చి 15 విద్యా సంస్థలను పూర్తిగా మూసివేసారు. అనంతరం పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. 2020 సెప్టెంబర్ 1న 3 నుంచి 10వ తరగతుల వరకు ఆన్ లైన్‌లో పాఠాలను ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులకు ఫిజికల్ గా పాఠాలను ప్రారంభించారు. 2021 మార్చి 1 నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు ఫిజికల్ తరగతులను ప్రారంభించారు. సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 2021 మార్చి 23 నుంచి అన్ని తరగుతులను బంద్ చేశారు. ఏప్రిల్ 26 నుంచి టీచర్లకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులను ప్రారంభించారు.
ఫిజికల్ తరగతులపై వెనక్కి తగ్గిన ఏపీ..
సెకండ్ వేవ్ మొదలైన సమయంలో విద్యాసంస్థలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం అనతి కాలంలోనే పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిజికల్‌గా పాఠాలను ప్రారంభించిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంతో గ్రామాల్లో పొలిటికల్ యాక్టివిటీలు బాగా పెరిగాయి. దీనికి తోడు పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం, విద్యార్థులకు శానిటైజేషన్ పట్ల అవగాహనలు లేకపోవడంతో ఒక్కసారిగా వైరస్ వేల మంది విద్యార్థులకు సోకింది. దేశమంతటా పాఠశాలలు మూసివేసిన సమయంలో ఏపీలో ఏ విధంగా ప్రారంభిస్తారని సుప్రీంకోర్ట్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి చనిపోయినా.. కానీ రూ.కోటి చెల్లించాలని ఆదేశించడంతో వెంటనే ఫిజికల్ గా తరగతులను మూసివేసారు.
విద్యాశాఖకు సవాలుగా మారనున్న ఫిజికల్ తరగతులు..
ఫిజికల్‌గా తరగతులను ప్రారభించాలని ఏర్పాట్లను చేస్తున్న విద్యాశాఖకు పాఠశాలలోని సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో స్కావెంజర్ల కొరతతో అపరిశుభ్ర వాతావరణాలు నెలకొన్నాయి. పాఠశాల శానిటేషన్ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో పారిశుధ్యం పడకేసింది. పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వలన చాలా వరకు పాఠశాలల్లో పారిశుధ్య పనులు కొనసాగడం లేదు. చెత్తా చెదారం, మురుగు నీరు పేరుకుపోయి తరగతుల ఆవరణంలో దుర్గంధం వెలువడుతుంది. ఫిజికల్ తరగతులను ప్రారంభించడం వలన విద్యార్థుల సంఖ్య ఎక్కవగా ఉన్న పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం, కరోనా నిబంధనలు పాటించడం పెను సవాళుగా మారనున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఏ మేరకు జాగ్రత్తలు చేపట్టనుందనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో మొదలవుతున్నాయి.
విద్యార్థులను విభజించాలి..
ఫిజికల్ తరగతులు ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్‌టీఎఫ్ స్వాగతిస్తుంది. కరోనా సోకుండా విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో భౌతిక దూరం పాటించేందుకు విద్యార్థుల విభజన చేపట్టాలి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో వేరువేరుగా తరగతులు నిర్వహిస్తే భౌతిక దూరం పాటించేందుకు ఆస్కారముంటుంది. స్కావెంజర్లను నియమించి పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి.
-కట్కం రమేష్ టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు