మళ్లీ లాభాల బాటలో సూచీలు

by Harish |
మళ్లీ లాభాల బాటలో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు మళ్లీ లాభాల బాటపట్టాయి. బుధవారం నాటి స్వల్ప లాభాల నుంచి గురువారం ఉదయం కొంత నష్టాలను నమోదు చేసినప్పటికీ తర్వాత కోలుకున్నాయి. కొవిడ్-19కు వ్యాక్సిన్ ఆశలపై అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతుండటంతో దేశీయ మార్కెట్లలోనూ ఆ ప్రభావం కనబడింది. ఉదయం గంటపాటు ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు తర్వాత నిలదొక్కుకున్నాయి. మదుపర్లు సైతం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో మిడ్ సెషన్ సమయానికి దూకుడు పెంచాయి.

ఇక, చివరి గంటలో లాభాల జోరు పెరగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 419.87 పాయింట్లు లాభపడి 36,471 వద్ద ముగియగా, నిఫ్టీ 121.75 పాయింట్ల లాభంతో 10,739 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవ్వగా, మీడియా రంగం కుదేలయింది. నిఫ్టీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల జోరుతో ఏకంగా 10 శాతంపైగా లాభపడింది. సెన్సెక్సి ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ అధిక లాభాలను నమోదు చేయగా, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story