ఐదురోజుల జోరుకు బ్రేక్.. కుదేలైన మార్కెట్లు!

by Shyam |   ( Updated:2020-07-08 06:56:34.0  )
ఐదురోజుల జోరుకు బ్రేక్.. కుదేలైన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస ఐదు రోజుల లాభాలను బ్రేక్ పడింది. ఉదయం నుంచి లాభాల పరంపర కొనసాగినప్పటికీ చివరి గంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావంతో ఊగిసలాటలో కొనసాగినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత పూర్తిగా బలహీనపడింది. దీంతో సెన్సెక్స్ 345.51 పాయింట్లను కోల్పోయి 36,329 వద్ద ముగియగా, నిఫ్టీ 93.90 పాయింట్ల నష్టంతో 10,705 వద్ద క్లోజ్ అయింది. వరుస ఐదురోజుల ర్యాలీతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఈ కారణంగానే మార్కెట్లకు నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీ, ఆటో, మీడియా, రియల్టీ రంగాలు 2 శాతం వరకూ నష్టపోయాయి. ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్పంగా లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అధికంగా 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Next Story