నష్టాలతో ముగిసిన మార్కెట్లు…ఎయిర్‌టెల్ అధిక లాభం!

by Harish |
నష్టాలతో ముగిసిన మార్కెట్లు…ఎయిర్‌టెల్ అధిక లాభం!
X

మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇండియా ఆర్థిక వృద్ధిపై హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ భాగం సూచీలన్నీ నష్టాల్లోనే కొనసాగాయి. టెలికాం కంపెనీలు దాఖలు చేసిన ఏజీఆర్ సవరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా షేర్లు 22.32 శాతం తగ్గి రూ. 3.48కు చేరాయి. అయితే, అనూహ్యంగా భారతీ ఎయిర్‌టెల్ షేర్లు సెన్సెక్స్ సూచీల్లో అన్నిటికంటే అత్యధికంగా 4.71 శాతం లాభపడి ఎక్కువ లాభాలతో మొదటిస్థానంలో ట్రేడయింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202.05 పాయింట్ల నష్టంతో 41,257 వద్ద ముగిసింది. నిఫ్టీ 61.20 పాయింట్ల నష్టంతో 12,113 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌లో తొలి 30 సూచీల్లో 22 సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 4.24 క్షీణించి చిట్టచివరలో ఉంది. ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్‌ల షేర్లు లాభాల్లో కదలాడాయి. ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ సూచీలూ నష్టాల బాట పట్టాయి.

Advertisement

Next Story