- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా భయంతో పతనమైన స్టాక్ మార్కెట్లు..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే డీలాపడ్డ సూచీలు మిడ్-సెషన్ సమయంలో కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ అనంతరం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం మదుపర్లలో ఆందోళన కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే, అమెరికా ఫెడ్ సమావేశం నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచీ స్పందించాలని భావిస్తున్నారు. ఇక, దేశీయంగా ప్రధాని మోదీ కరోనా కేసుల అంశంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారని నిపుణులు తెలిపారు. ఈ కారణాలతోనే బుధవారం మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 562.34 పాయింట్లు కోల్పోయి 49,801 వద్ద ముగియగా, నిఫ్టీ 189.15 పాయింట్ల నష్టంతో 14,721 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.55 వద్ద ఉంది.