మార్కెట్లకు తప్పని నష్టాలు!

by Harish |
మార్కెట్లకు తప్పని నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కరోనా కలిగిస్తున్న నష్టాలకు దేశీయ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలనే నమోదు చేశాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమై తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి నష్టాలతోనే క్లోజయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581.28 పాయింట్ల నష్టంతో 28,288 వద్ద ముగిసింది. నిఫ్టీ 205.35 పాయింట్లను కోల్పోయి 8,263 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లోనే కదలాడాయి. నిఫ్టీలో మెటల్ 5 శాతానికి పైగా నష్టపోయింది. రియల్టీ 3.5 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.6 శాతం, ఐటీ 3 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇక, యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం రూ. 75.07 వద్ద ఉంది.

tags : sensex, nifty, BSE, NSE, Stock market

Advertisement

Next Story

Most Viewed