- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
38 వేల మార్కు దాటిన సెన్సెక్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి అమ్మకాల ఒత్తిడిని అధిగమించి సూచీలు మళ్లీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలను నమోదు చేసిన మార్కెట్లు నిలకడగా కొనసాగుతూ చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో 250 పాయింట్లకు పైగా ఎగిసింది. ఐదురోజుల వరుస లాభాల తర్వాత బుధవారం బ్రేక్ వచ్చినప్పటికీ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడం శుభపరిణామమని విశ్లేషకులు అభిప్రాపడ్డారు. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీ రంగం మినహా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాలు 1 శాతానికిపైగా లాభపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 268.95 పాయింట్లు లాభపడి 38,140 వద్ద ముగియగా, నిఫ్టీ 82.85 పాయింట్ల లాభంతో 11,215 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆల్ట్రాటెక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.