బల్దియా బరిలో సీనియర్లు vs సిన్సియర్లు

by Anukaran |   ( Updated:2020-11-28 00:42:11.0  )
బల్దియా బరిలో సీనియర్లు vs సిన్సియర్లు
X

దిశ ప్రతినిధి మేడ్చల్: బల్దియా ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. యువకులు ఎన్నికల బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. నూతన సాంకేతికతతో యువకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు డివిజన్లను ఏలిన సీనియర్లు వారికి ధీటుగా పావులు కదుపుతూ తమ అనుభవాన్నంతా రంగరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలు సీనియారిటీ వర్సెస్ సిన్సియారిటీని తలపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ బోర్డు ఎన్నికలు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,122మంది అభ్యర్థులు రంగంలో దిగారు. వీరిలో 60శాతం 45ఏళ్లలోపు యువకులు బరిలో నిచినట్లు ఎన్నికల యంత్రాంగం వెల్లడించిన అభ్యర్థుల జాబితాను భట్టి తెలుస్తోంది. కాగా, జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి అతి పెద్ద వయస్సు ఉన్న కాజా సూర్యనారాయణ(75) టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 21ఏళ్ల వయస్సున్న 8మంది నవ యువకులు గ్రేటర్ రాజకీయ అరంగ్రేటం చేశారు.

వీరితోపాటు మూడు, నాలుగు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన సీనియర్లూ తలపడుతున్నారు. సీనియర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, జూనియర్లు కొత్త ఆలోచనలు, వ్యూహాలతో సీనియర్లను చిత్తు చేయడానికి ఎత్తుల కు పై ఎత్తులు వేస్తున్నారు. అనుభవం లేని వారిని ఎన్నుకుంటే తరువాత ఇబ్బందులు పడుతారని సీ నియర్లు ప్రచారం చేస్తుండగా, అనుభవంతో ప్రజల కు చేసేందేమి లేదని యువత ప్రచారం చేస్తోంది.

కొత్త హంగులు.. ఆర్భాటాలు..

ఎన్నికల ప్రచారంలో సీనియర్లకంటే జూనియర్స్ కొన్ని డివజన్లలో ముందంజలో ఉన్నారు. పలు డివిజన్లలో బస్తీలు, కాలనీల్లో యువ నాయకులు వ్యాట్సప్, ఫేస్ బుక్ తదితర గ్రూపులు క్రియేట్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి యువ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పలు డివిజన్లలో స్థానిక సమస్యలపై షార్ట్ ఫిలీమ్స్ రూపొందించి ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నం చేస్తుండగా, సీనియర్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రథాల్లో చక్కర్లు కొడుతున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు.

గెలుపుపై ధీమా..

బల్దియా ఎన్నికల్లో సీనియర్లు చావో రేవో అన్నట్లు అన్ని హంగులు, అర్ధ బలాన్ని వినియోగిస్తున్నా రు. మొదటిసారి పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ప్రచారం చేస్తున్నారు. సీనియర్లు చేసిన వైఫల్యాలను ఎండగడుతున్నారు. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలని కోరుతున్నారు. సీనియర్లు తమ అనుభవాన్ని గుర్తించి గెలిపించాలని ఓట్లు అడుగుతుండగా, జూనియర్లు మాత్రం వారు కష్టపడితే స్థానికంగా ఇన్ని సమస్యలు ఉండేవి కావని, మరోసారి వారికి అవకాశం ఇచ్చినా.. పెద్దగా ఒరిగేది లేదని ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Next Story