Dubbaka బీజేపీలో ముసలం! సీనియర్ల రహస్య సమావేశం?

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-03 03:02:34.0  )
Dubbaka బీజేపీలో ముసలం! సీనియర్ల రహస్య సమావేశం?
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నుంచి దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావుకు సొంత పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా సీనియర్లు తిరుగుబాటు బాట పట్టారు. తమకు పార్టీలో గౌరవం ఇవ్వడం లేదంటూ సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్ కార్యచరణ కోసమంటూ సీనియర్లు రహస్య సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక రాగా బీజేపీ నుంచి పోటీ చేసి రఘునందన్ రావు గెలిచిన విషయం తెలిసిందే.

Also Read..

ప్రేమ కోసమా.. ఉగ్రవాద శిక్షణ కోసమా..?

Next Story

Most Viewed