- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొమ్మలపాటి మృతి : జర్నలిస్టు సంఘాల సంతాపం
దిశ,కంటోన్మెంట్: సీనియర్ జర్నలిస్టు కొమ్మలపాటి నర్సింహారావు(62) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొద్దిరోజులుగా చికిత్స పొంది నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన నర్సింహారావుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందారు.
ఆయన గత ముప్పై ఏళ్ళుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేస్తూ జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా జర్నలిస్టు సమాజానికి తన వంతు సేవలందించారు. రంగస్థల నటుడిగా, దూరదర్శన్ లో కూడా పలు సీరియళ్లలో నటించి పలువురి చేత ఉత్తమ నటుడిగా ప్రశంసలందుకున్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం..
సీనియర్ జర్నలిస్టు నర్సింహారావు మృతికి పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలియజేశాయి. తనకు చిరకాల మిత్రుడైన నర్సింహ్మారావు సౌమ్యుడని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వాడని, నర్సింహారావు మృతి చెందడం బాధాకరం. ఆయన మరణం పత్రికా రంగానికి, కళా రంగానికి తీరని లోటని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య విచారం వ్యక్తంచేశారు.
నర్సింహారావు మృతికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని మామిడి సోమయ్య తెలిపారు. నర్సింహారావు మృతికి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, నిరంజన్ లు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.