కరోనా‌తో సీనియర్ జర్నలిస్ట్ మృతి

by Sridhar Babu |
కరోనా‌తో సీనియర్ జర్నలిస్ట్ మృతి
X

దిశ,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కొండ వేణు మాధవ్ కరోనాతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణకాగా బెల్లంపల్లిలోని ఐసోలేషన్ కేంద్రంలో చికిత్సపొందుతున్నాడు. దీంతో అయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. వేణు భార్య ఇందిర రెండేళ్ల క్రితమే క్యాన్సర్‌తో మరణించిది. మృతుడికి ఇద్దరు కూతుళ్లకు వివాహాలు కాగా తల్లి సైతం కరోనా వ్యాధి సోకడంతో ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతోంది. వేణు మాధవ్ అకాల మృతి పట్ల బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు సజ్నుషఫీ, తనుగుల రాజన్న, పుల్యాలరాజు, కార్కురి సదానందంలతో పాటు మనోజ్ కుమార్ పాండే, గోపతి జనార్థన్, బద్రి వెంకటేష్ తదితర పాత్రికేయులు ఆయన పార్థివ దేహనికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story