విగ్రహానికి ఉరి వేసుకున్న సీనియర్ లాయర్.. కారణం ఏంటో తెలుసా..?

by Sridhar Babu |
విగ్రహానికి ఉరి వేసుకున్న సీనియర్ లాయర్.. కారణం ఏంటో తెలుసా..?
X

దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని విజయపురికాలనీకి చెందిన సీనియర్ అడ్వకేట్ మేకల రాజేశ్వర్ (58) రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల–ధర్మపురి రహదారిపై గల దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఆయన తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశ్వర్ జగిత్యాల కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. మృతునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కలత చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కాగా సీనియర్ అడ్వకేట్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్ల తోటి అడ్వకేట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story