- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా రిస్క్ ఎంతో… ఆన్ లైన్ లో తెలుసుకోండిలా?
దిశ వెబ్ డెస్క్: ఇంట్లో ఎవరైనా.. అదే పనిగా తుమ్మినా… లేదా దగ్గినా… వాళ్ల మదిలో ఒకటే ఆలోచన. కాస్త నలతగా అనిపించినా… కొద్దిగా తలనొప్పి వచ్చినా.. ఒకటే హైరానా. శరీరం కొంచెం వేడెక్కినా.. కడుపులో వికారంగా తోచినా.. మనసంతా ఆందోళన. గొంతులో మంట పుట్టిన, చాతిలో నొప్పి వచ్చినా.. ఎక్కడలేని భయం. శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చిన సరే.. కరోనా వచ్చిందేమో ఆందోళన. ఏం జరుగుతుందనన్న దిగులు. ఇంట్లో ఉండే చాలా మంది పరిస్థితి ఇంచుమించుగా ఇలానే ఉంది. మరి మనకు కరోనా సోకిందని ఎలా తెలుస్తుంది? మన శరీర లక్షణాల ఆధారంగా మనం ఉన్న స్థితిని ఎలా అంచనా వేయవచ్చా? ఇంట్లో ఉండే కరోనా రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చా? అవును తెలుసుకోవచ్చు. ఎలా అంటే..
మనకు అసలు కరోనా ఉందా? దాని లక్షణాలు ఎలా ఉన్నాయి? ఈ లక్షణాలు కూడా ఎప్పటికప్పుడు, వ్యక్తి నుంచి వ్యక్తికి మార్పు చెందుతాయా? అసలు ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించినా, మన ఆరోగ్య విషయంలో మనకు సందేహాలు వస్తూనే ఉంటాయి. సో వాటికి చెక్ చెప్పేందుకు … ఎన్ ఐ హెచ్ డబ్ల్యూ ఎన్ ( NIHWN) యాప్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే సరి. దీంట్లో కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకునేలా ‘‘సంజీవని’’పేరుతో ప్రత్యేక విభాగం ఉంది. యాప్ ను ఓపెన్ చేశాక ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వొచ్చు. హోం పేజీలోనే కోవిడ్ 19 పేరుతో మనకు అక్షరాలు కనిపిస్తాయి. దాన్ని ట్యాప్ చేస్తే.. ‘‘సంజీవన్ కోవిడ్ 19 రిస్క్ అసెసర్’’ అని ఓపెన్ అవుతుంది. అదే అడిగే ప్రశ్నలకు అవును , కాదు అంటూ సమాధానాలు చెబుతూ వెళ్లాలి. టెస్ట్ అయిపోయాక.. మనకో వెబ్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. మన రిపోర్ట్ డౌన్ లోడ్ అవుతుంది. అండ్రాయిడ్, యాపిల్ స్టోర్ లో ఇది అందుబాటులో ఉంది.
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్‌ల నుంచి:
https://tinyurl.com/NIHWNgoogle or Apple Appstore https://tinyurl.com/NIHWNapple లను డౌన్ చేసుకుని కరోనాపై సమాచారం తెలుసుకోవచ్చు. , కోటిరెడ్డి ఫౌండేషన్ ఈ యాప్ ను అందించింది. అమెరికాలోని ‘‘హార్వర్డ్ గ్లోబల్ హై’, ఏపీలోని ‘‘శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’’లతో కోటిరెడ్డి ఫౌండేషన్ ఒప్పందం చేసుకుని వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
జియో లోనూ:
జియో కస్టమర్లు కూడా కోవిడ్ 19 ఉందో లేదో తెలుసుకోవచ్చు. జియో కేర్ యాప్ ఓపెన్ చేయగానే.. అందులో సింప్టమ్స్ చెకర్ అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే.. మన లోకేషన్ ఆన్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత ఎవరి కోసం ఈ టెస్ట్ చేస్తున్నావు అనే ప్రశ్న కనిపిస్తుంది. అందులో నీకోసమా( ఫర్ యువర్ సెల్ఫ్) , పేరేంట్స్, భార్య, పిల్లలు, లేదా ఇతరుల కోసమా? అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి క్లిక్ చేయగానే. మేల్ ఆర్ ఫిమేల్ అని అడుగుతుంది ఆ తర్వాత 12 సంవత్సరాల లోపా, 12 -50, 51-60 , అబౌవ్ 60 .. వీటిలో ఏ ఏజ్ గ్రూప్ కు సంబంధించినమో తెలియజేయాలి. మన ఆరోగ్య పరిస్థితి తెలియజేయాలి. అందులో ఆస్తమా, క్రోనిక్ లంగ్ డిసీజ్, డయాబెటిస్, హార్ట్ డిసిజ్, ప్రెగ్నెన్సీ, నన్ ఆఫ్ ది ఎబౌ అని ఉంటుంది. వీటిలో మనకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే తెలియజేయాలి. గత 14 రోజుల్లో మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా .. చైనా , ఇటలీ , స్పెయిన్, ఇరాన్, యూరప్, సౌతిస్ట్ ఆసియా, దేశాలు వెళ్లి వచ్చారా లేదా వేరే ఏ దేశాలైనా వెళ్లారా? అసలు ఎక్కడికి వెళ్లలేదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత భారతదేశంలోనే ఏ పర్యటనైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చేశారా? వారిలో ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవాల్లతో క్లోజ్ కాంటాక్ట్లో మాట్లాడారా? అని అడుగుతుంది. కోవిడ్ 19 వచ్చిన వ్యక్తితో మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్లోజ్ గా మెలిగారా అంటూ ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం ఎస్ ఆర్ నో చెప్పాకా.. జ్వరం ఉందా అని అడుగుతుంది. తలనొప్పి, దగ్గు, జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్వరం జీరగా మారిందా? ఇలా ఒక్కోక్కటిగా మనల్ని ప్రశ్నిస్తుంది. వీటికి మన సమాధానం చెప్పిన దాని ప్రకారం.. మనకు కరోనా వైరస్ సోకే రిస్క్ ఎంత ఉందో తెలియజేస్తుంది.
Tags : coronavirus, covid 19, self examination, checkup, test, report, health care, download,app