- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు బాబులకు షాక్ ఇచ్చే వీడియో.. మద్యంను ఎలా కల్తీ చేస్తున్నాడో చూడండి..
దిశ, కోదాడ: అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యంను కోదాడ ఎక్సైజ్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రాజలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలో కల్తీ మద్యంను విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద నిఘా వేశారు. ఖమ్మం నుండి ద్విచక్రవాహనంపై పేరాల శ్రీను అనే వ్యక్తి కల్తీ మద్యం ను తీసుకుని వస్తుండగా, సదరు వాహనమును ఆపి తనిఖీ చేయడంతో వాహనంలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఖమ్మంలోని శ్రీను ఇంటి వద్దకు వెళ్లి సోదా చేయగా, చాలా రకాలకు చెందిన మద్యం బ్రాండ్లకు సంబంధించిన కల్తీ మద్యం ఉండడంతో వాటిని కూడా స్వాధీనపరచుకొని, శ్రీనును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాజలక్ష్మి తెలిపారు.
కోదాడ లో కల్తీ మద్యం కలకలం
కోదాడ లో కల్తీ మద్యం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారనే సమాచారం సోషల్ మీడియా ద్వారా దావానంలా, కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు పట్టణ ప్రజలకు చేరడంతో, ఒక్కసారిగా మందుబాబులు అవాక్కయ్యారు. ఇన్ని రోజులు కోదాడలో తీసుకున్న మద్యం కల్తీ ఉన్నదా లేదా అనే ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉండగా కల్తీ మద్యం ఏ వైన్ షాపులకు విక్రయిస్తున్నారో, ఆ వైన్ షాపుల పై ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.