- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
దిశ, సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలో ఆదివారం మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల కోసం 8 పరీక్ష కేంద్రాల కేటాయించారు. అయితే, ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
సిద్దిపేట పట్టణంలో ఏడు పరీక్ష కేంద్రాలు, తెలంగాణ మోడల్ స్కూల్ ఇర్కోడ్ లో 1 కేంద్రం ఉన్నదన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని అన్నారు.
పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ అధికారులు పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్లు..
1. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట్.
2. జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంద్ర నగర్ సిద్దిపేట్.
3. గవర్నమెంట్ హై స్కూల్ మెదక్ రోడ్ సిద్దిపేట్.
4. గవర్నమెంట్ హై స్కూల్ ఉర్దూ మీడియం నాసర్ పురా సిద్దిపేట్.
5. గవర్నమెంట్ న్యూ హై స్కూల్ సిద్దిపేట్.
6. గవర్నమెంట్ హై స్కూల్ పారుపల్లి సిద్దిపేట్.
7. గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ సిద్దిపేట.
8. తెలంగాణ మోడల్ స్కూల్ ఇర్కోడ్.