ఏటీఎంలో నింపాల్సిన డబ్బును కొట్టేశారు !

by Shyam |
ఏటీఎంలో నింపాల్సిన డబ్బును కొట్టేశారు !
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఏటీఎంలో నింపాల్సిన నగదును పక్కదారి పట్టించిన ఘటన హైదరాబాద్‌ నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటీఎం కేంద్రాల్లో క్యాష్ మేనేజ్మెంట్, రిప్లేస్‌మెంట్ నిర్వహించే సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. బీటీఐ పేమెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. 36ఏటీఎం కేంద్రాల్లో నగదు డిపాజిట్‌ చేసే బాధ్యతను బీటీఐ తీసుకుంది. ఈ సంస్థలో రాజశేఖర్‌రెడ్డి, రమా భారత్, సాయితేజ్, అశ్విన్‌లను కస్టోడియన్లుగా నియమించి ఏటీఎం తాళాలు, పాస్‌వర్డ్ చెప్పారు. అయితే రాజశేఖర్‌రెడ్డితో పాటు పాటు మరో ముగ్గురు కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న రూట్లలో రిపోర్టు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు ఆడిట్ నిర్వహించగా రూ.1.23కోట్లు లెక్కలోకి రాలేదు. దీంతో జులై 17న క్యాష్ మేనేజ్మెంట్, రిప్లేస్‌మెంట్ నిర్వహించే సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జనరల్ మేనేజర్ హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు పరారీలో ఉన్న మరో ముగ్గురికి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story