ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సుంకపాక దేవయ్య మృతి

by Shyam |   ( Updated:2020-11-26 03:26:19.0  )
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సుంకపాక దేవయ్య మృతి
X

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, ప్రముఖ సామాజిక ఉద్యమ కారులు సుంకపాక దేవయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముషీరాబాద్ మండలం రామ్ నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచాడు. గతంలో సుంకపాక దేవయ్య లిడ్ కాప్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇదే సమయంలో ఉద్యోగంతో పాటు SC రిజర్వేషన్లలో మాదిగ సామాజిక వర్గానికి జగురుతున్న అన్యాయాన్ని గుర్తించి గొంతెత్తి నినాదించాడు. అంతేకాకుండా.. SC రిజర్వేషన్లను వర్గీకరించాలని ఆది జాంబవ అరుంధతీయ సమాఖ్య ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో MRPS లో దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. సుంకపాక మృతిపట్ల రాష్ట్ర SC,ST కమిషన్ చైర్మన్ డాక్టర్. ఎర్రోళ్ల శ్రీనివాస్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, సామాజిక సంఘాల నాయకులు నివాళులు అర్పించారు.

Advertisement

Next Story