గోల్డ్ లోన్ తీసుకునే వారికి SBI అదిరే ఆఫర్లు!

by Anukaran |
SBI offers
X

దిశ, వెబ్‌డెస్క్ : మీరు బంగారంపై లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు లేదా గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. అయితే వడ్డీ రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే.. అక్కడ లోన్ తీసుకోవడం బెస్ట్. సాధారణంగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఉత్తమం. భారత దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా చౌక వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది.

ప్రస్తుతం ఎస్‌బీఐలో అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, ఈజీ లోన్ రీపేమెంట్ వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్‌లో బంగారం తనఖా పెట్టి రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణం పొందొచ్చు. లోన్ టెన్యూర్ 3 ఏళ్లు. ఎస్‌బీఐ యోనో ద్వారా రుణం కోసం అప్లై చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి మెుదలవుతుంది. తక్కువ వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స కూడా ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు పొందొచ్చు. అలాగే పలు రకాల రీపేమెంట్ ఆప్షన్లు లభిస్తాయి.

Advertisement

Next Story