- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు షాకిచ్చిన సర్పంచ్.. ఏం చేశాడంటే ?
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల పరిధిలోగల మైలారం గ్రామంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్ త్వరలో పర్యటన ఉండబోతుందని అంతర్గతంగా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వస్తే అడ్డుకుంటామని గ్రామ సర్పంచ్ ఎళ్లి కంటే శ్రీనివాసులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం దిశ ప్రతినిధి చరవాణి ద్వారా సర్పంచ్ వివరణ కోరగా తాను మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలను స్వాగతిస్తున్నామని అదేవిధంగా సామాన్యులకు చిన్న, సన్నకారు రైతులకు ఉన్న కాస్త భూమిని కోల్పోయి బజారున పడ్డారని, కావున పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వాయర్‌ను మా గ్రామపంచాయతీ పరిధిలో కాకుండ అందుకు ప్రత్యామ్నాయంగా నల్లచెరువు ఏరియాలో ఉమామహేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేపడితే రైతులకు నష్టం జరగదని ఆయన తెలిపారు.