సర్కారి వారి పాట.. విలన్ కావలెను

by Shyam |
సర్కారి వారి పాట.. విలన్ కావలెను
X

దిశ, వెబ్‌డెస్క్: మహేష్ బాబు లెటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట కోసం సరైనోడిని చిత్ర బృందం అన్వేషిస్తోంది. ఈ చిత్రంలో కథా నాయకుడితో పాటు ప్రతినాయకుడి పాత్ర పవర్ ఫుల్‌ ఉంటున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రను ఎంత భయంకరంగా చూపిస్తే సినిమాకు అంతే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సరిపోయే విలన్ విషయంలో అంచనాలు ఎక్కువే ఉంటాయి. అయితే, చిత్ర బృందం సర్కార్ వారి పాట చిత్రానికి సరిపోయే విలన్ల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ మోసాలకు సంబంధించిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

అయితే, మహేశ్ బాబుకి పోటీగా నిలిచే విలన్ క్యారెక్టర్ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకించి ఓ ముగ్గురు నటులపై ఫోకస్ చేస్తున్నారంటా.. ఇందులో సన్ ఆఫ్ సత్యమూర్తిలో ప్రతి నాయకుడి పాత్రలో అలరించిన ఉపేంద్ర, ధృవ సినిమాలో తొలిసారిగా తెలుగులో విలన్ క్యారెక్టర్ చేసిన అరవింద్ స్వామి, కిచ్చా సుదీప్‌లను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేసిన సర్కార్‌ వారి పాటకు సరైనొడు వచ్చినట్లే అవుతుందని వార్తలొస్తున్నాయి.

Advertisement

Next Story