- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నూలు థియేటర్‌లో మహేశ్ ఫ్యాన్స్ హంగామా
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు సిటీ విక్టరీ థియేటర్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ మాస్ హంగామా సృష్టించారు. 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే సినిమాను కరోనా తర్వాత.. అంటే సినిమా విడుదలైన 300 రోజుల తర్వాత రీరిలీజ్ చేయగా అదే క్రేజ్, అదే జోరుతో కర్నూలు విక్టరీ థియేటర్ హౌజ్ ఫుల్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తారో.. ఎంత గొప్పగా అభిమాన నటుడి సినిమా రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటారో.. అదే మాదిరిగా పండుగ చేసుకున్నారు.
విక్టరీ థియేటర్‌లో మహేశ్ బాబు కటౌట్‌కు పాలాభిషేకం చేయడంతో పాటు సెలబ్రేషన్స్‌తో థియేటర్ లోపల మాత్రమే కాదు బయట కూడా పేపర్లు చించి ఎగరేస్తూ మహేశ్‌కు జై కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
Kurnool City Victory Theatre First Show Houseful For #SarileruNeekevvaru 🔥💥 After Pandemic Kuda E Range Mass Ante Ne StarDom Ki 🙏 @urstrulyMahesh Anna #SarkaruVaariPaata pic.twitter.com/2K364Zx0im
— Kurnool Mahesh FC ™ 🔔 (@KurnoolDHFMs) December 27, 2020