టాప్ ప్లేస్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’

by Shyam |
టాప్ ప్లేస్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ అంటూ 2020 పొంగల్ బరిలో విన్ అయిన మూవీ.. ఇప్పుడు ట్విట్టర్ ఇండియా లిస్ట్‌లో చేరింది. 2020 మోస్ట్ ట్వీటెడ్ మూవీ హ్యాష్ ట్యాగ్స్ లిస్ట్‌లో టాప్3లో నిలిచింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘దిల్ బెచారా’ సినిమా ఫస్ట్ ప్లేస్ కొట్టేయగా.. సూర్య లేటెస్ట్ మూవీ ‘సురారై పొట్రు’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆల్ ఇండియా ర్యాంకింగ్స్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్న సరిలేరు నీకెవ్వరు .. టాలీవుడ్ మోస్ట్ ట్వీటెడ్ 2020 మూవీగా నిలవడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. గత రెండేళ్లుగా ఈ రికార్డ్ మహేశ్ చిత్రానికే దక్కుతుండడం విశేషం. 2018లో భరత్ అను నేను, 2019లో మహర్షి చిత్రం ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story