‘సర్దార్’ సినిమా చూపించాడు .. మరో 32 వచ్చుంటే..

by Sridhar Babu |   ( Updated:2021-12-14 01:13:28.0  )
‘సర్దార్’ సినిమా చూపించాడు .. మరో 32 వచ్చుంటే..
X

దిశ, కరీంనగర్ సిటీ: టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ మరో 32 ఓట్లు సాధించినట్టయితే మ్యాజిక్ చేసేవారేనని స్పష్టం అవుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 232 సాధించిన ఆయన మరో 32 ఓట్లను పొందినట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చేది. దీంతో ఆయన రెండో ప్రాధాన్యతతో మండలిలో అడుగు పెట్టే అవకాశం ఉండేది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. ముగ్గురు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం. 17 చెల్లని ఓట్లు వచ్చాయి, కానీ ముగ్గురు మాత్రం అసలు ఓటే సాధించుకోలేకపోయారు.

ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న సైదాపూర్ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డిని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిరాశకు గురి చేశారు. ఆయనకు కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి.

Advertisement

Next Story