కన్నెపల్లి టు సారలమ్మ గద్దె..

by Shyam |
కన్నెపల్లి టు సారలమ్మ గద్దె..
X

క్తులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహాఘట్టం ఆరంభమైంది. కన్నెపల్లి నుంచి భక్తజన సందోహం మధ్య సారలమ్మను ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువచ్చి, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి ప్రతిష్టించారు. అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి మరియు సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి నూతన వస్ర్తాలు సమర్పించారు. సారలమ్మ గద్దె మీదకే రావడంతో ఆమెను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మేడారంలో ఇప్పటికే గోవిందరాజు, పడిగిద్దరాజులు గద్దెల పైకి చేరుకోవడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలుపుతున్నారు. సారలమ్మ వచ్చిన తెల్లవారు సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకువచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఆ రోజున మేడారంలో ఇసుకవేస్తే రాలనంత భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని సమాచారం. రెండేడ్లకొకసారి వచ్చే గిరిజన జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా, జిల్లా కలెక్టర్ కర్ణన్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed