దుబాయ్‌లో పాండ్యాతో సంజయ్‌దత్ కొడుకు.. రియాక్ట్ అయిన తల్లి!

by Shyam |
hardhik
X

దిశ, సినిమా : సంజయ్ దత్ కొడుకు షహ్రాన్.. హార్దిక్ పాండ్యాతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ పిక్చర్‌ను పోస్టు చేశాడు. తన వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో క్రికెటర్‌తో తీసుకున్న పిక్‌ షేర్ చేసిన షహ్రాన్.. ‘హార్దిక్ పాండ్యాతో అమేజింగ్ డిన్నర్ నైట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు అతడి తల్లి మాన్యతా దత్ ‘కూల్ డూడ్స్’ అంటూ కామెంట్ చేయగా, స్టెప్ సిస్టర్ త్రిషాల దత్.. ‘కూల్ పిక్ బ్రో’ అంటూ హార్ట్ ఎమోజీస్ యాడ్ చేసింది. ఇక ఈ ఫొటోపై ప్రేమను కురిపిస్తున్న ఫ్యాన్స్.. షహ్రాన్ ఊతకర్రలు ధరించడం పట్ల ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడి కాలికి గాయం కావడంతోనే క్లచెస్ సాయంతో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ ఇటీవలే అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా కాంబినేషన్‌లో వచ్చిన ‘భుజ్’ సినిమాలో కనిపించగా.. ‘షంషేరా, కేజీఎఫ్ చాప్టర్ 2, పృథ్వీరాజ్’ వంటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాడు.

Advertisement

Next Story