- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుమ్రాతో పెళ్లి: సంజనా పాత ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా పెళ్లి గురించి గత కొంతకాలంగా మీడియాలో వస్తున్న వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. మోడల్, స్పోర్ట్స్ కామెంటేటర్ సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లడనున్నాడని, ఈ మేరకు వీరి పెళ్లికి ఇరు కుటుంబాల బంధువులు కూడా ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. మార్చి 14న లేదా 15న గోవాలో వీరి పెళ్లి జరగనుందని, పెళ్లికి కుటుంబసభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా బుమ్రా, సంజనా ప్రేమించుకుంటున్నారని, ఇప్పుడు బంధువులను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారని వినికిడి. ఈ క్రమంలో గతంలో బుమ్రా గురించి సంజనా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం. బుమ్రా ఆన్‌ఫీల్డ్ మూడ్, రోజూ తన మూడ్ ఒకేలా ఉన్నాయంటూ ఆమె ట్వీట్ చేసింది.
జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ సమయంలో బుమ్రా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను సంజనా తన ట్విట్టర్‌లో షేర్ చేసి, పై విధంగా స్పందించింది. త్వరలో వీరిద్దరు పెళ్లిచేసుకోబోతున్నారనే వార్తల క్రమంలో.. ఈ పాత ట్వీట్ వైరల్ అవుతోంది.