- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింబుల్డన్‌లో సానియా జోడి శుభారంభం
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ 2021లో భారత జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్న శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇండియాకే చెందిన రామ్‌కుమార్-అంకిత రైనా జోడీతో తలపడి గెలుపొందారు. ఇరు జోడీలు గంటకు పైగా తలపడ్డాయి. తొలి సెట్‌లో రామ్‌కుమార్-అంకిత రైనా కాస్త తడబడ్డా.. రెండో సెట్‌లో పోరాడారు.
కానీ సానియా-బోపన్న అనుభవం ముందు తలొంచక తప్పలేదు. సానియా జోడీ 6-2, 76 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు. ఈ జోడి ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, క్రిస్టీనా లాడెనోవిక్‌తో తలపడనున్నారు. కాగా, గురువారం సానియా మీర్జా మహిళ డబుల్స్‌లో అలెక్సా గువారచి, డెసిరే క్రాజిక్ జోడీపై 7-5, 6-3 తేడాతో గెలుపొందారు. ఒలింపిక్స్‌లో భారత్ తరపున సానియా మీర్జా-అంకిత రైనా జోడి పాల్గొననున్నారు.
Advertisement
Next Story