- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్
దిశ, శేరిలింగంపల్లి: భూ వివాదాలు, మోసాలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. భూముల అమ్మకాలకు సంబంధించిన కేసులతో పాటు మోసాలకు పాల్పడ్డట్లు శ్రీధర్ రావుపై మాదాపూర్ జోన్ పరిధిలోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో మూడు కేసులు, గచ్చిబౌలి పీఎస్‌లో మూడు కేసులు, నార్సింగి పీఎస్‌లో ఒక కేసు, మియాపూర్ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయని తెలిపారు. ఈనెల పదో తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 8 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఆయా పోలీసు స్టేషన్‌లలో విచారణ జరుగుతుందన్నారు. బుధవారం బెంగళూరులో శ్రీధర్ రావును అరెస్ట్ చేసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీధర్ రావు బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.