జక్కన్నకు సందీప్ వంగా #betheREALMEN చాలెంజ్

by Shyam |
జక్కన్నకు సందీప్ వంగా #betheREALMEN చాలెంజ్
X

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా… ఈ సినిమాతో సంచలనాలు సృష్టించాడు. విజయ్ దేవరకొండ కు స్టార్ రేంజ్ దక్కేలా చేశాడు. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి… రికార్డులు బద్దలు కొట్టాడు. చేసింది ఒక్క సినిమానే కానీ… నేషనల్ లెవెల్ డైరెక్టర్ అయిపోయాడు. తన తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్న సందీప్ వంగా… స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని పాన్ ఇండియా హీరో కోసం వెతుకతున్నాడు. కానీ కరోనా కారణంగా షూటింగ్ లు ఎలాగూ వాయిదా పడడంతో ఇంట్లోనే ఉంటున్న సందీప్… తన వీడియో ద్వారా రియల్ మెన్ ఎవరో చెప్తున్నాడు.

మనిషి అనే వాడు గొప్ప గృహ కార్మికుడిగా ఉండొచ్చు… నిజమైన పురుషుడు తన భార్యకు ఇంటి పనుల్లో చేదోడుగా ఉండాలని పిలుపునిస్తున్నాడు. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో దయచేసి ఇంటి పనిలో సహాయం చేయాలని కోరాడు. #betheREALMEN హ్యాష్ టాగ్ ద్వారా దర్శకధీరుడు రాజమౌళికి ఈ చాలెంజ్ విసిరారు సందీప్ వంగా. వీడియోను అప్ లోడ్ చేసి మరింత మందిని ఈ చాలెంజ్ కు నామినేట్ చేయడం ద్వారా… మన ఇళ్లలో స్త్రీలకు సహాయం చేద్దామని కోరారు సందీప్ వంగా.

Tags : Sandeep Vanga, SS Rajamouli, #betheREALMEN, Tollywood

Advertisement

Next Story