- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ పని చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా : సామ్
సౌత్ ఇండస్ట్రీలో ఫుల్‌క్రేజ్ సంపాదించిన సమంత అక్కినేని లాక్‌డౌన్‌లో తన పెట్ డాగ్ హాష్‌తో పూర్తి సమయాన్ని గడిపేసింది. ఇంట్లో వంట కూడా ట్రై చేసిన సామ్.. ఇప్పుడు గార్డెనింగ్ మొదలు పెట్టింది. తన ఇంటిపైనే మొక్కలు పెంచుతున్న అక్కినేని వారి కోడలు.. మీకు టైమ్, ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ ట్రై చేయండని అభిమానులకు సూచిస్తోంది. ‘భూమితో ఉన్న అనుబంధాన్ని మొక్కల పెంపకం ద్వారా తెలుసుకున్నానని.. అప్పటి నుంచి భోజనం తినే ముందు ధన్యవాదాలు తెలుపుకోవడం ప్రారంభించానని’ చెప్తోంది. భోజనం మన కంచంలోకి చేరాలంటే ఎంత కష్టం ఉంటుందో అర్థం అవుతోందంటున్న సామ్.. ‘ఒక విత్తనం మొలకెత్తేందుకు ఎంత స్ట్రగుల్ అవుతుందో.. అది చెట్టుగా ఎదిగేందుకు ఎన్నేళ్లు పడుతుందో గమనించాక.. నేను ఈ పని చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని తెలిపింది.
తన తోటలో పెరిగిన ఆకుకూరలను ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసిన సామ్.. వీటిని ఎలా ఉపయోగించాలో అర్ధం కాలేదని.. అందుకే ‘శ్రీదేవి జాస్తి’ దగ్గర కుకింగ్ లెస్సన్స్ నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఫస్ట్ డే క్లాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. తొలిరోజు చేసిన సూప్ యమ్మీగా ఉందని తెలిపింది.