సామ్.. పర్‌ఫెక్ట్ యోగాసన్

by Shyam |
సామ్.. పర్‌ఫెక్ట్ యోగాసన్
X

లాక్‌డౌన్ సమయాన్ని ఎవరైనా చక్కగా సద్వినియోగం చేసుకున్నారంటే.. అది పక్కా మన బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని అని చెప్పాల్సిందే. కొన్ని రోజులు ఫుల్ టైమ్ భర్త నాగ చైతన్య, పెట్ డాగ్ హాష్‌కే పూర్తి సమయం కేటాయించిన తను.. ఆ తర్వాత గార్డెనింగ్ స్టార్ట్ చేసింది. అది సక్సెస్ అయ్యాక 48 రోజుల ‘ఇషా క్రియ’ యోగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన కుక్కపిల్ల హాష్‌‌తో కలిసి ఇషా క్రియ స్టార్ట్ చేసిన సామ్.. ఇప్పుడు తన భర్త నాగ చైతన్యను కూడా తనతో పాటు యోగా చేయిస్తోంది.

లేటెస్ట్ పోస్ట్‌లో ఆసనం వేస్తున్న ఫొటోను షేర్ చేసిన సామ్.. ‘ఇంతకుముందు గార్డెనింగ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశా.. ఇప్పుడు అంతే బాగా యోగా చేయడాన్ని ఇష్టపడుతున్నా’ అని తెలిపింది. తనతో పాటు చై కూడా యోగా చేయడమే ఇందుకు కారణమన్న సామ్ ట్వీట్‌పై రకుల్‌ప్రీత్ స్పందించగా.. ‘నీ వల్లే ఇన్‌స్పైర్ అయ్యా.. యోగా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది సామ్. ఇక లావణ్య త్రిపాఠి సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అసలు నువ్వు చేయలేనిది ఏమీ ఉండదని.. పర్ఫెక్ట్‌గా చేశావని చెప్పింది. రుహానీ శర్మ, నమ్రతా శిరోద్కర్, ప్రగ్యా జైస్వాల్ కూడా సామ్‌ను ప్రశంసించారు.

https://www.instagram.com/p/CB4lqk-BrIx/?igshid=11blfh7hz2hkp

Advertisement

Next Story