- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టులో సమంత- చైతన్య డైవోర్స్ కేసు.. వెడ్డింగ్ రింగ్ తో ప్రత్యక్షమైన అక్కినేని కోడలు
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సమంత- చైతన్య విడాకుల వార్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయమై అటు అక్కినేని ఫ్యామిలీ కానీ, ఇటు సామ్ కానీ క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు తమకు నచ్చింది ఊహించేసుకుంటున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో సమంత విడిపోతున్నారంటూ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరి విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో నడుస్తోందని, కౌన్సెలింగ్ కోసం సామ్ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సమంత ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టులు ఆసక్తిని రేపుతోన్నాయి.
నిన్నటికి నిన్న బ్రేకప్ స్టోరీ పోస్ట్ చేసిన సామ్ తాజాగా తన కుక్కపిల్లలతో సమయం గడుపుతున్న ఫోటో షేర్ చేసింది. అందులో ఏముంది..? సామ్ కి పెట్స్ అంటే ఇష్టం కాబట్టి షేర్ చేసింది అనుకోవచ్చు. కానీ, నెటిజన్లు మాత్రం కుక్కపిల్లలతో పాటు సామ్ చేతికి ఉన్న రింగ్ ని కూడా కనిపెట్టేశారు. అది సామ్ – చై ల వెడ్డింగ్ రింగ్. ఈ విడాకుల మాట వాస్తవమే అయితే ఇంకా సామ్ ఆ రింగ్ ని తీయకుండా ఎందుకు ఉంది..? అంటే ఈ విడాకులు అన్ని రూమర్స్ యేనా..? సామ్, చై మధ్య విభేదాలు నిజంగా ఉన్నాయా..? అని అనుమానిస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు కొంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరోజు బ్రేకప్ స్టోరీ పెడుతోంది.. ఇంకోరోజు వెడ్డింగ్ రింగ్ చూపిస్తోంది.. అసలు ఈ జంట వారి వైవాహిక బంధంపై క్లారిటీ ఇవ్వకుండా ఎన్నిరోజులు తిరుగుతారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం సామ్ రింగ్ నెట్టింట వైరల్ గా మారింది.