ఆహా!.. సమంతకు అంత రెమ్యునరేషనా.?

by Shyam |   ( Updated:2020-11-16 06:47:40.0  )
ఆహా!.. సమంతకు అంత రెమ్యునరేషనా.?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో సమంత అక్కినేని గురించి పొగడని వారు లేరు. అన్ని విషయాల్లోనూ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటూ స్టార్ ఐకాన్‌గా ఎదిగిన సామ్.. రోజురోజుకూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌తో పాటు సామ్‌ హోస్టింగ్ కూడా అదిరిపోయిందని చెప్పాడు. అయితే ఫస్ట్ ఎపిసోడ్ చూశాక ప్రోగ్రామ్ డిజైన్ ఇంతకుముందున్న కొన్ని షోస్‌ను గుర్తుకుతెచ్చేలా ఉన్నా.. సామ్ మాత్రం తన పని తాను పర్‌ఫెక్ట్‌గానే చేసింది. అందుకేనేమో సామ్ భారీగా చార్జ్ చేసిందని ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ షో కోసం సామ్ తీసుకునే రెమ్యునరేషన్.. సినిమాలతో పోల్చితే దాదాపు ఐదు రెట్లు ఎక్కువని టాక్. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు షో కంటిన్యూ అవుతుందని అల్లు అరవింద్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 12 ఎపిసోడ్ల షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాగా సామ్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. షో షూటింగ్ ఒక్క రోజులో కంప్లీట్ అవుతుంది కాబట్టి పన్నెండు రోజులకు రూ. 1.8 కోట్లు. కానీ ఇదే రెమ్యునరేషన్ రావాలంటే సినిమాలకు దాదాపు అరవై రోజుల కాల్షీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కాగా ఇంత భారీ రెమ్యునరేషన్‌ చూసిన మరింత మంది స్టార్స్ కూడా ఇలాంటి షోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story