- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్కౌట్ల కోసం బాగా కష్టపడ్డావ్ బిడ్డా.. అందుకో మా రివార్డ్
దిశ,వెబ్‌డెస్క్: ఓ యువకుడు రన్నింగ్ లో ఉన్న కారు పైకెక్కి పుషప్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలపై పోలీసులు తమదైన స్టైల్లో స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత కృష్ణ మురారీ యాదవ్ కుమారుడు ఉజ్వల్ యాదవ్ ఓ ప్రధాన రహదారిపై స్కార్పియో డ్రైవింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో నడుస్తున్న కారుపైకెక్కి పుషప్స్ తీశాడు. అనంతరం ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోల్ని చూసిన నెటిజన్లు నువ్వు హీరోలా ఉన్నావని, సినిమాల్లో ట్రై చేయోచ్చు కదా అని పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలపై ఉజ్వల్ యాదవ్ కు రూ.2500 ఫైన్ విధించారు. అంతేకాదు వర్కౌట్ల కోసం నువ్వు బాగా కష్టపడ్డావ్. అందుకు మేమిచ్చే రివార్డ్ ఇదేనంటూ ఫైన్ విధించిన చలాన్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Some Pushups will only bring you down in the eyes of Law !
Stay Strong, Stay Safe !#UPPCares #UPPolice pic.twitter.com/dvGSjtL2Az
— UP POLICE (@Uppolice) March 13, 2021