సలార్’ సాగా బిగిన్స్.. నెట్టింట్లో షూటింగ్ వీడియోలు లీక్

by Jakkula Samataha |   ( Updated:2021-01-31 03:40:36.0  )
సలార్’ సాగా బిగిన్స్.. నెట్టింట్లో షూటింగ్ వీడియోలు లీక్
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వయొలెంట్ ‘సలార్’ మూవీ షూటింగ్ మొదలైంది. రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే హీరో ప్రభాస్ అక్కడికి చేరుకోగా..తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. ‘సలార్’ తొలి రోజు షూటింగ్ కంప్లీట్ అయిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్ చేసింది.

కాగా, ‘సలార్’ షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ అవుతున్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తున్న సినిమాలో ప్రభాస్ ప్రజెంట్ డ్రిల్లింగ్ మెషిన్ మెకానిక్‌ గెటప్‌లో కనిపిస్తుండగా..తనతో పాటు బొగ్గు గని కార్మికులు షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. డార్లింగ్‌ను ఈ గెటప్‌లో చూసిన ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

https://twitter.com/UrstrulyUmeshh/status/1355350703175200770?s=20

అభిమాన హీరో షూటింగ్ కావడంతో అక్కడకు చేరుకున్న ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక సింగరేణి కాలరీస్ నుంచి హోటల్‌కు వెళ్తున్న ప్రభాస్ కాన్వాయ్‌తో పాటు షూటింగ్ స్పాట్‌లో మేకప్‌ పూర్తయ్యాక వానిటీ వ్యాన్ నుంచి దిగుతున్న డార్లింగ్ వీడియోకు ఓ లెవల్‌లో రెస్సాన్స్ వస్తోంది.

https://twitter.com/i/status/1355493321242681344

Advertisement

Next Story