- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రక్తదానానికి అందరూ ముందుకు రావాలి: సజ్జనార్
దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా కారణంగా నగరంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్తం కొరత ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి యాజమాన్యం100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని, కొత్త వేరియంట్ పై బయపడవలసిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఏంజీబీఎస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును హైదరాబాద్ కలెక్టర్ తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శర్మణ్ మాట్లాడుతూ.. రక్త దానం చేయడం మూలంగా వివిధ కారణాలవల్ల రక్తం అవసరం అయ్యే వారికి,ప్రాణాపాయంలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్ చేసే వారికి, క్యాన్సర్ రోగులకు ఈ రక్తదాన శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.