సచిన్‌కు లారస్ స్పోర్టింగ్ మొమెంట్ అవార్డ్

by Shyam |   ( Updated:2020-02-17 23:54:09.0  )

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను మరో అరుదైన అవార్డు వరించింది. 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు భారత ఆటగాళ్లు సచిన్‌ను భూజాల మీద ఎత్తుకున్న సందర్భంగాను.. లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డు వచ్చింది. ముంబయిలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్‌కు అత్యధిక ఓట్లు రావడంతో అతన్ని విజేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..‘ ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. దేశం మొత్తం సంబరాలు చేసుకుంది’. అని సచిన్ అన్నాడు. ఈ అవార్డు తన ఒక్కడిది కాదని, అందరిది అని సచిన్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story