ఎల్బీ‌నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

by Shyam |
ఎల్బీ‌నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉప్ప‌ల్‌ – ఎల్బీన‌గ‌ర్ మార్గంలో కామినేని ఆస్పత్రి వ‌ద్ద నిర్మించిన ఫ్లైఓవ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో నిర్మించిన అండ‌ర్ పాస్‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ ర‌ద్దీ ర‌హితంగా తీర్చిదిద్ద‌డానికి వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌థ‌కం (ఎస్‌ఆర్‌‌డీపీ) కింద చేప‌ట్టిన ఫ్లైఓవ‌ర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండ‌ర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌తో అంత‌ర్జాతీయ న‌గ‌రాల‌కు ధీటుగా హైద‌రాబాద్ నిలుస్తోందని తెలిపారు. ఎస్‌ఆర్‌‌డీపీ ప్యాకేజీ-2 కింద రూ. 448 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన 11 ప‌నుల్లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.268 కోట్ల విలువైన ప‌నులు పూర్తైయినట్లు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా చింత‌ల్‌కుంట వ‌ద్ద అండ‌ర్‌పాస్‌, కామినేని వ‌ద్ద రెండు వైపులా ఫ్లైఓవ‌ర్లు, ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో విజ‌య‌వాడ వైపు వెళ్లే ఫ్లైఓవ‌ర్‌తో పాటు ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో అండ‌ర్‌పాస్‌లు పూర్తయ్యాయని వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ ర‌వీంద‌ర్ రాజు, ఎల్బీన‌గ‌ర్‌ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story