- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై ఉమ్మడిగా పోరాడుదాం
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు సంసిద్ధంగా ఉండండి.. కానీ అధైర్య పడకండి అని ప్రధాని మోదీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సార్క్ దేశాల అధినేతలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ క్రమంలో మోదీ మాట్లాడుతూ… సార్క్ దేశాల్లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి నామామాత్రంగానే ఉంది. కేవలం 150 కేసులు నమోదు అయ్యాయి. కానీ ప్రపంచ జనాభాలో ఐదో వంతు జనాభా మన దేశాల్లో ఉన్నందునా అప్రమత్తంగా ఉండాలి. అందరం కలసి పనిచేసి, కరోనాపై ఉమ్మడిగా విజయం సాధించాలని మోదీ సూచించారు.
కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు వైద్య సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి భారత్ వేగంగా చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్త వహించింది. కరోనా వైరస్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యం’ మోదీ అని తెలిపారు.
tag; pm modi, carona saarc countries, video confarance