సోమశిల డ్యాం పై పుకార్లు..నెల్లూరులో అలజడి

by srinivas |
nelluru collecter
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం దెబ్బతినిందని..దీంతో డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు జలాశయం కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నెల్లూరు కమిషనర్ దినేశ్ కుమార్ స్పందించారు.

సోమశిల జలాశయం కుప్పకూలి పోయిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. సోమశిల జలాశయం తెలుగు గంగ ప్రాజెక్టు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. సోమశిల జలాశయం అత్యంత పటిష్టంగా ఉందని, డ్యామ్ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని జేసీ స్పష్టం చేశారు. ప్రజల్లో అలజడి రేగేలా తప్పుడు సమాచారాన్ని ఎవరైనా ప్రచారం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హరేంద్ర ప్రసాద్, కమిషనర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు.

అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీస్ శాఖ ప్రకటించింది. వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఫేస్‌బుక్, వాట్సప్ ప్రచారం చేస్తున్న వారిపై కూడా ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ శాఖ సైతం హెచ్చరించారు.

Next Story

Most Viewed