కార్మికుల సమస్యలు తీర్చమంటే.. విచారణ పేరుతో వేధిస్తారా..?

by Aamani |
కార్మికుల సమస్యలు తీర్చమంటే.. విచారణ పేరుతో వేధిస్తారా..?
X

దిశ, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై అధికారులను ప్రశ్నించినందుకు ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి గోలి శంకర్‌ను 4 రోజుల నుంచి విధుల్లోకి తీసుకోకుండా విచారణ పేరుతో వేధిస్తున్న డిపో మేనేజర్ మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని డిపోలో ఉదయం నుండి బస్సులను నిలిపివేసి కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా సోమవారం తెల్లవారుజాము 5 గంటల నుండి డిపో గేట్ ఎదుట కార్మికులు బైరాయించి నిరసన వ్యక్తం చేశారు.

గోలి శంకర్ పై కక్షసాధింపు చర్యలు మానుకుని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు యూనియన్ రీజియన్ గౌరవ అధ్యక్షులు కలవేన శంకర్ చొరవతో యాజమాన్యంతో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి సంప్రదింపులు జరపడంతో గోలి శంకర్‌ను
విధుల్లోకి తీసుకున్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీపీఐ పట్టణ కార్యదర్శి కలిందర్ అలి ఖాన్, నాయకులు వీబీ రావు, శ్రీనివాస్, రాజేశం పాల్గొన్నారు.

Advertisement

Next Story