- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోసం చేస్తే ప్రాణం పోయింది
దిశ, వెబ్‌డెస్క్: మోసం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అధికారం అడ్డు పెట్టుకొని వేధింపులు చేసినందుకు ఓ అమాయకుడు బలైయ్యాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళగిరి ఆర్టీసీ డిపోలో బల్లయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొద్దిగా పొలం ఉంది. అయితే, ఓ ఇంటెలిజెన్స్ సీఐ బల్లయ్య వద్ద ఆ పొలం కొనుగోలు చేశాడు. కానీ, కొద్దిగా డబ్బులు చెల్లించి మిగతావి వాయిదాలో చెల్లిస్తానంటూ అగ్రిమెంట్ రాయించుకున్నాడు. సీఐ పై నమ్మకంతో బల్లయ్య దీనికి ఒప్పుకున్నాడు. ఇదే పొలం పేపర్లను చూయించి సీఐ పుత్రజయ హుటల్స్ పేరుతో రూ. 3 కోట్ల లోన్ తీసుకున్నాడు.
కానీ, మిగతా డబ్బులు మాత్రం చెల్లించకుండా బల్లయ్యను సీఐ ముప్పుతిప్పలు పెట్టాడు. అధికారం అడ్డుకుని బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వేధింపులు తాళలేక బల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బలయ్య చావుకు కారణమైన ఇంటెలిజెన్స్ సీఐ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.